నవతెలంగాణ-హైదరాబాద్: మోడీ సర్కార్‌పై కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఫైర్ అయ్యారు. మహాత్మా గాంధీ పేరు మార్పుతో పాటు ఉపాధీ హామీ పథకాని లేకుండా చేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. MGNREGA పేరు మారుస్తూ ఇటీవల పార్లమెంట్ లో కేంద్రం ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వికసిత్ భారత్ రోజ్‌గర్ గ్యారెంటీ అజీవికా మిషన్ గా పేరు మార్చింది. మోడీ సర్కార్ నిర్ణయాన్ని కాంగ్రెస్ తో పాటు విపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. అదే విధంగా శాంతి యుత నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలోనే కర్నాటకలో కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ ప్రభుత్వానికి ఆందోళన నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. రానున్న రోజుల్లో కరెన్సీ నోట్లపై కూడా గాంధీ ఫోటో తొలగిస్తారని, ఆ పని చేస్తే జనాలు బీజేపీని అధికారం నుంచి శాశ్వతంగా తొలగిస్తారని హెచ్చరించారు. చట్టాన్ని స్కీమ్‌గా మారుస్తూ ఉపాధి హామీని నీరుగార్చారని, ఆర్థికంగా రాష్ట్రాలపై పెను భారం మోపారని విమర్శించారు.
మోడీ సర్కార్‌పై డీకే శివకుమార్ ఫైర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



