నవతెలంగాణ-హైదరాబాద్: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ పై ఉభయసభలలో సుదీర్ఘ చర్చ సాగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పహల్గాం దాడి కుట్రదారులను హతం చేశామని వెల్లడించారు. ఈక్రమంలో విపక్షాలు మోడీ సర్కార్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. ఇవాళ లోక్ సభలోఆపరేషన్ సిందూర్ పై చర్చ సందర్భంగా డీఎంకే ఎంపీ కనిమొళి సెటైర్లు వేశారు. విశ్వగురు ఈ తరహా దాడులతో గుణపాఠం నేర్చుకున్నారా? అని ప్రశ్నించారు. గతంలో జరిగిన దాడులతో బీజేపీ అప్రమత్తం కాలేదని, ఉగ్రవాదుల దాడులను నిలువరించడంలో మోడీ సర్కార్ విఫమైందని ఆమె విమర్శించారు. విశ్వగురు ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదు, ఆయన ఏమీ నేర్పించలేదని ఎంపీ ఎద్దేవా చేశారు.
మోడీపై డీఎంకే ఎంపీ సెటైర్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES