Saturday, May 17, 2025
Homeతెలంగాణ రౌండప్మద్యం సేవించి వాహనాలు నడపొద్దు 

మద్యం సేవించి వాహనాలు నడపొద్దు 

- Advertisement -

-తాడ్వాయి ఎస్సై  శ్రీకాంత్ రెడ్డి
నవతెలంగాణ -తాడ్వాయి : నిబంధనలకు విరుద్ధంగా, మద్యం సేవించి వాహనాలను నడిపిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని  తాడ్వాయి ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి వాహనదారులను హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలో వాహన దారులకు బ్రీత్ అనలైజర్ తో ఆల్కాకహాల్ స్థాయిని పరీక్షించారు. సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలు నివారణకు పోలీస్ శాఖ అనేక చర్యలు చేపడుతున్న ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని గుర్తు చేశారు. మైనర్లకు, తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇచ్చి రోడ్లపైకి పంపిస్తే భారీ జరిమానతో పాటు, కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -