నవతెలంగాణ మునుగోడు:
ఏండ్ల తరబడి నుండి సాగు చేసుకుంటున్నా మా భూములకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతిలోనైనా మాకు న్యాయం చేయాలని మండలంలోని కిష్టాపురం గ్రామానికి చెందిన నిరుపేదలు గురువారం మునుగోడు తాసిల్దార్ నరేష్ కు వినతి పత్రం అందజేశారు . ఈ సందర్భంగా బోయ లింగస్వామి మాట్లాడుతూ గత 6నెల 12వ తేదీన గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించగా సర్వేనెంబర్ 232 లో గత కొన్ని సంవత్సరాల నుండి 50 నుండి 60 మంది నిరుపేదలు వారసత్వంగా వస్తున్న భూమిని రెవిన్యూ సదస్సులు దరఖాస్తు చేసుకునేందుకు వస్తే ప్రభుత్వ భూమికి దరఖాస్తులు తీసుకోమని నిరాకరించిన అధికారులు , అదే సర్వే నెంబర్ లో దరఖాస్తు చేసుకున్న ఇద్దరికి దరఖాస్తు తీసుకొని , సర్వేయర్ విచారణ ఏ విధంగా చేస్తారని ప్రశ్నించారు..? ఏండ్ల తరబడి నుండి సాగు చేసుకుంటున్న లబ్ధిదారులకు భూభారతి లో విచారణ చేపట్టి నిరుపేదలకు పట్టాలను చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో మారయ్య ,ఎన్ వెంకన్న , మల్లయ్య , సుక్కయ్య , ఇస్తారి , టి రాములు , ఊశయ్య , నందిపాటి వెంకయ్య , నందిపాటి పెద్దలు , గోపాలు , బోయ లింగయ్య , తదితరులు ఉన్నారు