నవతెలంగాణ-సిద్ధిపేట: సీపీ అనురాధను ఇండియన్ మెడికల్ అసోసియేషన్, తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం వైద్యులు కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ రోగి పట్ల నిజంగా ఏదైనా నిర్లక్ష్యం జరిగితే న్యాయ పరంగా చర్యలు తీసుకోవాలని, కానీ ఇలా దౌర్జన్యాలు చేయటము సరికాదని చెప్పారు. తమపై దాడులు చేసిన వారిపై గతంలో సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు. హైదరాబాద్ వంటి నగరాల్లో లభించే చికిత్స ఇక్కడ లభిస్తున్నా, కొందరి ఆగడాలతో చికిత్స చేయడానికి భయపడి హైదరాబాద్ పంపే పరిస్థితి వస్తుందని తెలిపారు. దీనివల్ల రోగి మార్గమధ్యంలో మరణిసున్నారని, వారిపై ఆర్ధిక భారం కూడా ఎక్కువ పడుతుందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇక నుండి ఏ హాస్పిటల్స్ పై కూడా అన్యాయంగా దాడులకు దిగితే ఆక్ట్ నెంబర్ 11of 2008 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి భరోసా ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు రామచందర్ రావు, చంద్రారెడ్డి, సుగుణా సతీష్, ఎస్.శ్రీనివాస్, దేవేందర్, రజని గంధ, అరుణా, శ్రీలక్ష్మి, చందర్, భాస్కర్, వీవీ రావు, భీమేశ్,అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తామపై దాడులను అరికట్టాలి..సీపీకి వైద్యుల వినతి పత్రం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES