Saturday, February 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఫ్లాట్‌గా దేశీయ మార్కెట్ సూచీలు..

ఫ్లాట్‌గా దేశీయ మార్కెట్ సూచీలు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశీయ మార్కెట్ సూచీలు ఆదివారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. దేశం మొత్తం కేంద్ర బడ్జెట్‌ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. మదుపర్లు అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు. ఉదయం 9.35 గంటల సమయంలో సెన్సెక్స్‌ 25 పాయింట్ల లాభంతో 82,294 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 25,303 వద్ద కదలాడుతోంది.

వివిధ రంగాలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పలు కీలక నిర్ణయాలను ప్రకటిస్తారన్న అంచనాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా ఉన్నారు. నిఫ్టీ సూచీలో సన్‌ఫార్మా, బజాజ్‌ ఆటో, భారత్‌ ఎలక్ట్రానిక్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హిందాల్కో, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, కోల్‌ ఇండియా స్టాక్స్ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. బడ్జెట్‌ నేపథ్యంలో ఆదివారం అయినప్పటికీ మార్కెట్లు పనిచేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -