- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల నడుమ మన సూచీలు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాల వేళ మన మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. ఉదయం 9.32 గంటల సమయంలో సెన్సెక్స్ 91 పాయింట్ల లాభంతో 81,491 వద్ద ఉండగా.. నిఫ్టీ 9.3 పాయింట్ల లాభంతో 24,982 వద్ద కదలాడుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.13 వద్ద ఉంది.
- Advertisement -