Monday, May 12, 2025
Homeజాతీయంభారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: సోమవారం ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. ట్రేడింగ్‌ ముగింపు సమయానికి భారీ లాభాల బాటనే ముగిశాయి. సెన్సెక్స్‌ ఏకంగా 2,950.34 పాయింట్లు లేదా 3.71 శాతం లాభంతో 82,404.81 వద్ద, నిఫ్టీ 912.80 పాయింట్లు లేదా 3.80 శాతం లాభంతో 24,920.80 వద్ద నిలిచాయి. చాల రోజుల తరువాత భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ నేడు ముగిసింది. ఈ విషయం తెలిసిన విదేశీ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు ఈ రోజు 3,500 కోట్ల రూపాయల నికర కొనుగోళ్లను నమోదు చేశారు. ఇదే సమయంలో డొమెస్టిక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు కూడా 2,800 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొన్నారు. ఇది మార్కెట్‌లో బలమైన డిమాండ్‌ను సూచిస్తుంది. కొన్ని కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలతో మార్కెట్‌ను ఆకర్షించాయి. బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ తమ నికర లాభం 59.05 కోట్ల రూపాయలకు చేరడంతో 14.78 శాతం పెరిగింది. ఈ క్రమంలో రాబోయే త్రైమాసిక ఫలితాలు, ఆర్‌బిఐ వడ్డీ రేట్ల నిర్ణయాలు మార్కెట్‌ దిశను నిర్ణయించే కీలక అంశాలుగా మారనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -