Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంజెలెన్‌స్కీకి డొనాల్డ్‌ ట్రంప్ పిలుపు

జెలెన్‌స్కీకి డొనాల్డ్‌ ట్రంప్ పిలుపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదారాబాద్: ఈనెల 18న‌(సోమవారం) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ కానున్నట్లు, రష్యాతో జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకడానికి చర్చలు జరపనున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమర్‌ జెలెన్‌స్కీ శనివారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ‘సోమవారం వాషింగ్టన్‌లో నేను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలవనున్నాను. రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికడానికి సంబంధించిన వివరాలపై మేము చర్చించనున్నాం. ట్రంప్‌ పంపిన ఈ ఆహ్వానానికి నేను కృతజ్ఞుడిని’ అని జెలెన్‌స్కీ అన్నారు.

కాగా, తాను యూరోపియన్‌ నేతలతో మాట్లాడే ముందు ట్రంప్‌తో భేటీ కానున్నట్లు జెలెన్‌స్కీ తెలిపారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో తాజాగా సమావేశమయ్యారు. అలస్కాలో జరిగిన ఇరువురి నేతల చర్చల అనంతరం మూడు రోజుల తర్వాత జెలెన్‌స్కీకి ట్రంప్‌ ఆహ్వానం పంపారు.

అయితే పుతిన్‌, ట్రంప్‌ల మధ్య చర్చ జరిగినప్పటికీ.. యుద్ధానికి ముగింపు పలికేలా ఎటువంటి ప్రకటనలు చేయలేదు. అయితే అలాస్కాలో సమావేశం జరిగిన మరుసటిరోజే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు యూరోపియన్‌ నేతలతో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇంతలోపే ట్రంప్‌ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. ఈ సమావేశంలో ట్రంప్‌తో రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు సంబంధించిన కీలక అంశాలను జెలెన్‌స్కీ చర్చించనున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad