నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మాదాపూర్ ఎంపీపీ ఎస్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు బుధవారం నాడు సీమ సుజాత నాందేవ్ గోపన్ప పల్లి తన తండ్రి విఠోబా జ్ఞాపకార్థంగా మధ్యాహ్న భోజన ప్లేట్స్ ను బహుకరించడం జరిగినది. ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాల లో గ్రామ సర్పంచ్ ఆషా చందర్ పాటిల్ అధ్యక్షతన దాత సీమ దీక్ష విశాల్ దంపతులు గ్రామ సర్పంచ్ తో కలిసి విద్యార్థిని , విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగినది. పాఠశాల హెచ్ఎం రాజయ్య మాట్లాడుతూ.. మారుమూల జుక్కల్ ప్రాంతంలో మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న మాదాపూర్ గ్రామాన్ని కామారెడ్డి జిల్లా వాసి అయిన దాత మండలంలోని పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థిని, విద్యార్థులకు తమ వంతుగా సామాజిక సేవలో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని. రాబోయే రోజులలో దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని దాతలకు విజ్ఞప్తి చేశారు.
సర్పంచ్ ఆశా పాటీల్ మాట్లాడుతు జిల్లా కేంద్రంలో ఉన్న దాతలు మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలైన ప్రాంతాన్ని ఎంపిక చేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. దాత దంపతులకు సర్పంచ్ ఎంపీపీ ఎస్ పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా శాలువాతో సన్మానించి అభినందించి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో లో గ్రామ సర్పంచ్ ఆషా రామచందర్ పాటిల్ , అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ సాయప్ప, ఉప సర్పంచ్ బసవే మారుతి, లక్ష్మణ్, ప్రధానోపాధ్యాయులు సిహెచ్ రాజయ్య, ఉపాధ్యాయులు సంతోష్ కుమార్, గోపాల్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



