Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మూఢనమ్మకాలు నమ్మవద్దు మంత్ర తంత్రాలు రూపుమాపాలి: పోలీస్ కళాబృందం

మూఢనమ్మకాలు నమ్మవద్దు మంత్ర తంత్రాలు రూపుమాపాలి: పోలీస్ కళాబృందం

- Advertisement -

నవతెలంగాణ-జక్రాన్ పల్లి

మూఢనమ్మకాలు నమ్మవద్దు మంత్ర తంత్రాలు రూపుమాపాలని పోలీస్ కళాబృందం చేత చింతలూరు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. నిజామాబాద్ పోలిస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చింతలూర్ గ్రామ ప్రజలకు చక్కని నాటిక, పాటలతో అవగాహన కల్పించారు. మూడ నమ్మకాలు నమ్మవద్దు – మంత్ర తంత్రాలు రూపుమాపాలి. రోడ్డు భద్రతలో భాగంగా హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాధాన్యత గురించి వివరించారు. మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించడం జరిగింది.

వాహనదారులు హెల్మెట్ ధరించాలి- హెల్మెట్ బరువు కాదు బాధ్యతని గుర్తు చేశారు.

జీవించు జివించ నివ్వురోడ్డు భద్రత నియమాలు పాటించు

ఆటో డ్రైవర్లు సెల్ ఫోన్ మాట్లాడుతు వాహనము నడపరాదు. అతివేగంగా, రాంగ్ రూట్లో, మద్యం సేవించి, వాహనాలు నడపరాదు. సైబర్ నేరగాళ్ల వలలో పడకండి జాగ్రత్తగా ఉండాలి. ఒక వేళ మోసపోతే 1930 కి ఫోన్ చేయగలరు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా శాంతియుతంగా మెలగాలని, అన్ని పండగలు స్నేహ పూర్వకంగా జరగాలని, సుఖ సంతోషాలతో మెలగాలని. ఆపద సమయంలో డయల్ 100 ఉపయోగించుకోవాలి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ శంకర్, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -