నవతెలంగాణ-హైదరాబాద్: విమాన ప్రమాదాలు జరిగినప్పుడు సొంత అభిప్రాయాలు చెప్పకూడదు అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం రాజ్యసభలో మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ …. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విదేశీ మీడియా అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సొంత అభిప్రాయాలు చెప్పకూడదు అని సూచించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని, ప్రమాదంపై ప్రాథమిక నివేదిక వచ్చిందని.. దాన్ని పరిశీలిస్తున్నాం అని తెలిపారు. తుది నివేదిక వచ్చిన తరువాత మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. విమాన ప్రమాదాలు జరిగినప్పుడు నిబంధనల ప్రకారమే దర్యాప్తు జరుగుతుంది అని రామ్మోహన్ నాయుడు వివరించారు.
ప్రమాదాలపై సొంత అభిప్రాయాలు చెప్పొద్దు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES