నవతెలంగాణ-హైదరాబాద్: ఆసియా కప్ టోర్నీలో భాగంగా రేపు దుబాయ్ వేదికగా పాక్-ఇండియా మధ్య రసవత్తరపోరు జరగనుంది. అయితే ఈసారి జరిగే మ్యాచ్ పై భారతీయుల్లో ఉత్సుకత కన్పించడంలేదు. మొదట్లో టికెట్లు రేట్లు భారీగా పెంచినా..ఇండియన్స్ ఆనాసక్తితో ప్రస్తుతం మ్యాచ్ టికెట్ల రేట్లును నిర్వహకులు తగ్గించారు. అయినా కూడా సగం టికెట్లు కూడా అమ్ముడు పోలేదని విశ్వసనీయ సమాచారం. తాజాగా పెహల్గాం ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన బాధితురాలు ఐషాన్య ద్వివేది స్పందించారు. భారత్-పాక్ మ్యాచ్‌పై బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో బీసీసీఐ క్రికెటర్లను బలవంతపెట్టొద్దన్నారు. అసలు మ్యాచ్‌కి కూడా అంగీకరించకుండా ఉండాల్సిందని ఆవేదన వ్యక్తంచేశారు. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాలను బీసీసీఐ విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. జమ్ములోని పహల్గాం ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 26మంది అమాయక పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. ఆ తర్వాత భారత్ ప్రభుత్వం ప్రతీకార చర్యగా ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రమూకల శిబిరాలపై బాంబుల వర్షం కురిపించారు.
క్రికెటర్లను బలవంతపెట్టొద్దు: పెహల్గాం బాధితురాలు ఐషాన్య ద్వివేది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES