Saturday, May 17, 2025
Homeఖమ్మంరైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

- Advertisement -

– యూరియా విరివిగా వాడొద్దు – డాక్టర్ డి.స్రవంతి 
నవతెలంగాణ – అశ్వారావుపేట : యూరియా అధిక మోతాదుల్లో వాడటంతో సాగు ఖర్చు పెరగటమే కాకుండా భూమిలో ఉన్న సూక్ష్మ జీవుల సంఖ్య కూడా తగ్గిపోతుంది అని, అలాగే అవసరం మేరకు రసాయనాలను వినియోగించి నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు వ్యవసాయ కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ డి.స్రవంతి రైతులకు సూచించారు.సాగు ఖర్చు తగ్గించుకొని అధిక లాభాలు పొందాలి ఆమె అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో,స్థానిక వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో శుక్రవారం మండలంలోని ఆసుపాకలో నిర్వహించారు. 
ఇందులో డాక్టర్ డి.స్రవంతి, డాక్టర్ పి.శ్రీలత లు  అన్నదాతలు సుస్థిర ఆదాయాన్ని పొందటానికి పంట మార్పిడిని అవలంబించాలని,అలాగే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి పురుగు మందుల వాడకం తగ్గించాలని లేని పక్షంలో పురుగుమందుల అవశేషాలు ఆహారాన్ని విషతుల్యం చేసి మానవాళి ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది అని న్నారు.నీటి కుంటలు,ఇంకుడు గుంతలు నిర్మించుకొని నీటి విలువ సామర్ధ్యాన్ని పెంచుకోవాలని అలాగే బహుళార్ధక సాధక చెట్లను పెంచుకుని వాతావరణ కాలుష్యాన్ని,నెల కోతను తగ్గించుకోవాలని తెలియచేసారు. 
ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు,వ్యవసాయ అధికారి శివ ప్రసాద్,వ్యవసాయ విస్తరణ అధికారులు రవీంద్ర రావు,సతీష్,పశువుల డాక్టర్ స్వప్న,పంచాయతీ సెక్రటరీ మోతిలాల్, విద్యార్ధులు పాల్గొన్నారు |

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -