Sunday, February 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్లకు మేము అర్హులం కాదా.?

ఇందిరమ్మ ఇండ్లకు మేము అర్హులం కాదా.?

- Advertisement -

జాబితాలో తమ పేర్లు రాలేదని ఆవేదన
నవతెలంగాణ – మల్హర్ రావు

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జాబితాలో తమ పేర్లు రాలేదని, తాము అర్హులం కాదాని మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన రేపాల వసంత-రాములు, భూషనవేన రమ-రమేష్ దంపతులతోపాటు పలువురు నిరుపేద కుటుంబాలు ప్రశ్నించాయి. ఆదివారం తాడిచెర్ల రైతువేదికలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చెసిన నేపథ్యంలో తమ పేర్లు రాలేదని ఆందోళన చెందారు. ప్రభుత్వం, సంబంధించిన అధికారులు ప్రకటించిన జాబితాలో అనర్హుల పేర్లు వచ్చాయని, అర్హులమైన తమ పేర్లు ఎందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, సంబంధించిన హౌసింగ్ ఉన్నతాధికారులు పట్టించుకోని జాబితా నుంచి అనర్హులను తొలగించి, అర్హులైన తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని వేడుకొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -