Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeరిపోర్టర్స్ డైరీఅప్పుడు గుర్తుకు రాలేదా?

అప్పుడు గుర్తుకు రాలేదా?

- Advertisement -

ఈ మధ్య ప్రధాన ప్రతిపక్షం గులాబీ పార్టీలో కొత్త కొత్త ఎపిసోడ్లు తెరమీదికొస్తున్నాయి. ఫోన్‌ ట్యాపింగ్‌, కాళేశ్వరం కహానీలు, విచారణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆ పార్టీకి, నిన్నటిదాకా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ వ్యవహారం ‘సర్దుబాటు’ అయినట్టుగా కనబడుతోంది. వాస్తవానికి కవిత తన తండ్రికి రాసిన లేఖలో ‘బీఆర్‌ఎస్‌.. బీజేపీకి దగ్గరవుతోంది…’ అంటూ ఆరోపించారు. అందుకే తాను లేఖ రాయాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీనిపై సొంత పార్టీ బీఆర్‌ఎస్‌ నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘అక్కా…మీకు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు బీజేపీతో బంధం గుర్తుకు రాలేదా? ప్రధాని మోడీ తీసు కొచ్చిన అనేక చట్టాలకు మీ నాయన కేసీఆర్‌ మద్దతిచ్చినప్పుడు బీఆర్‌ఎస్‌, బీజేపీ బంధం గుర్తుకు రాలేదా…’ అంటూ నెటిజన్లు సైతం సెటైర్లు విసురుతున్నారు.
-కే.నరహరి

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad