- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: 2026-27 విద్యా సంవత్సరంలో తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్ నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఏప్రిల్ 15 నుంచి మే ఏడో తేదీ వరకు మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు వెబ్ ఆప్షన్లు ఉంటాయి. మే 14న తొలి విడత సీట్ల కేటాయింపు. మే 15 నుంచి మే 23వ తేదీ లోపు విద్యార్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రెండో ఫేజ్ రిజిస్ట్రేషన్లు మే 15 నుంచి 25 వరకు, మూడో ఫేజ్ రిజిస్ట్రేషన్లు మే 31 నుండి జూన్ 15 వరకు ఉంటాయి.
- Advertisement -



