Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఅనుమానాలు తొలగించాలి

అనుమానాలు తొలగించాలి

- Advertisement -

– ఎన్నికల ప్రక్రియపై ప్రజావిశ్వాసాన్ని పునరుద్ధరించాలి
– ఇందుకు తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాలి : ఈసీఐని కోరిన సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో
న్యూఢిల్లీ :
దేశంలో ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పార్టీలు, ఇతరులు లేవనెత్తిన వివిధ ఆందోళనలు, అనుమానాలను తొలగించాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)ని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో కోరింది. ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాలని పేర్కొన్నది. ”ఇటీవలి కాలంలో ఎన్నికల నిష్పాక్షికత గురించి తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓటర్ల జాబితాను రూపొందించటంలో అవక తవకలు, ప్రత్యేకించి బీహార్‌లోని ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో చోటు చేసుకున్న లోపాల నుంచి మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో జరిగిన అనైతిక, అక్రమ చర్యల వరకు.. ఇవన్నీ అధికార పార్టీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై సమగ్ర విచారణ జరిపించటం, తాను పారదర్శకమైన, నిష్పాక్షికమైన రాజ్యాంగ సంస్థ అని ప్రజలకు నిరూపించటం ఈసీఐ విధి, బాధ్యత.” అని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో వివరించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad