నవతెలంగాణ-గోవిందరావుపేట
స్వర్గీయ డాక్టర్ అన్నవరం కృష్ణమూర్తి 66 జయంతి కార్యక్రమాన్ని మంగళవారం మండల కేంద్రం మరియు పసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా డాక్టర్ కృష్ణమూర్తి ఏకైక కుమారుడు అన్నవరం ఇంద్ర శేఖర్ గోవిందరావుపేట్, పస్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మరియు బస్ స్టాండ్ కూడలిలో దాదాపు 200 మంది పేద ప్రజలకు పండ్లు పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఇంద్ర శేఖర్ మాట్లాడుతూ మా తండ్రి డాక్టర్ కృష్ణమూర్తి ఈ ప్రాంత ప్రజలకు ఆశజ్యోతిగా డాక్టర్ గా సుమారు రెండు దశబ్దాల కాలం పాటు వైద్య సేవలు అందించారన్నారు. కృష్ణమూర్తి సేవలు జ్ఞాపకాలు, ఈ ప్రాంత ప్రజలకు ఎప్పటికి మరచిపోరు అని తెలిపారు. ప్రతి సంవత్సరం డాక్టర్ కృష్ణమూర్తి జ్ఞాపకా ర్థం గ్రామానికి ఉపయోగపడే సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో డాక్టర్. మధు , డాక్టర్. సునీత, వైద్య సిబ్బంది జంపన్న, క్రిష్ణయ్య, వారి శిష్యులు సునీల్, వెంకన్న, నాగరాజు,పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఘనంగా డాక్టర్ అన్నవరం కృష్ణమూర్తి జయంతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES