Saturday, January 10, 2026
E-PAPER
Homeనల్లగొండడా.షేక్ జెబున్నిసాకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

డా.షేక్ జెబున్నిసాకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: డా.షేక్ జెబున్నిసాకు ప్రతిష్టాత్మకమైన సావిత్రిబాయి ఫూలే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ల‌భించింది. విద్యా రంగంలో ఆమె అందించిన విశేష సేవలు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి చేసిన కృషిని గుర్తిస్తూ ఈ అవార్డు ప్రదానం చేయబడింది. ఈ సందర్భంగా డా. షేక్ జెబున్నిసా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి నుంచి అవార్డు స్వీకరించారు.డా. షేక్ జెబున్నిసా ఈ ఘనత పాఠశాలకే కాకుండా అన్నారం మండలం, సూర్యాపేట జిల్లాకే గర్వకారణంగా నిలిచింద‌న్నారు.

సూర్యాపేట జిల్లా అన్నారం మండలంలోని ZPHS పాఠశాలలో సామాజిక శాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న డా.షేక్ జెబున్నిసా ప్రతిష్టాత్మకమైన సావిత్రిబాయి ఫూలే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పొందడం గర్వకారణం.ఆమెకు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా రంగ ప్రముఖులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -