- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని తాజ్పూర్ గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ పరిశుద్ధ కార్మికుడు పల్లెపాటి యాదగిరిని మంగళవారం హైదరాబాదులో బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ పరామర్శించారు. కాగా యాదగిరి ప్రమాదవశాత్తు కింద జారిపడగా తలకు బలమైన గాయం అయింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ హైదరాబాదులో ఆయనకు ధైర్యం చెబుతూ, ఆయన చికిత్సకు 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. తన వంతు సహాయంగా ఆయనకు సహకారం అందించినట్లు తెలిపారు.
- Advertisement -