నవతెలంగాణ – తాడూర్
నాగర్ కర్నూల్ జిల్లాలోని తాడూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాల నివారణ, మానవ అక్రమ రవాణా నిర్మూలనపై అవగాహన నిమిత్తం విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు పాఠశాల, కళాశాల స్థాయి నుండే మొదలవ్వాలని అందుకు అధ్యాపకులు, విద్యార్థులు జమిలిగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా జిల్లా నోడల్ అధికారి, కళాశాల ప్రిన్సిపాల్ జి. వెంకట రమణ అన్నారు.
స్టూడెంట్ కౌన్సిలర్ డా. నర్రా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యపరుచుటకు కళలు తోడ్పడతాయని, తాడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు సామాజిక సంస్కరణకై ముందువరుసలో నిలబడ్డారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పిఓ మురళీకృష్ణ, శ్రీధర్ రెడ్డి, ఈశ్వరయ్య, బి. రాములు, సత్యం, రమేష్, భరత్, జగన్, శేఖర్ తదితరలు పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలనపై చిత్రలేఖన పోటీలు
- Advertisement -
- Advertisement -