నవతెలంగాణ -ముధోల్
ముధోల్ మండలంలోని తరోడ గ్రామంలో సమీకృత వ్యవసాయ క్షేత్రంలో బుధవారం రోజు నిర్మల్ జిల్లా డిఆర్ డిఓ విజయలక్ష్మి జన్మదిన వేడుకలను ఐకెపి, ఉపాధిహామీ సిబ్బంది నిర్వహించారు. సమీకృత వ్యవసాయ క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించడానికి రానున్నటంతో డి ఆర్ డి ఓ విజయలక్ష్మి వ్వవసాయ క్షేత్రానికి ముందుగా వచ్చారు. దీంతో డి ఆర్ డి ఓ కు జన్మదిన శుభాకాంక్షలను ఐకెపి, ఉపాధి హామీ సిబ్బంది తెలిపారు.వెంటనే కేకును తెప్పించి డిఆర్ డిఓ తో కేక్ కట్ చేయించారు.ఈసందర్భంగా ప్రతి ఒక్కరు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన అనంతరం డి ఆర్ డి ఓ కు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శివకుమార్, ఎపిఓ శిరి షా రెడ్డి, ఏపీఎం గురు చరణ్, ఐకెపి, ఉపాధి ఉపాధి సిబ్బంది , మహిళా సంఘాల సభ్యులు, పాల్గొన్నారు.
వ్యవసాయ క్షేత్రంలో డి ఆర్ డిఓ జన్మదిన వేడుకలు…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES