- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO), R&D సెక్రటరీ చీఫ్ సమీర్ వి.కామత్ పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగిస్తూ సోమవారం రాత్రి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. సైంటిస్ట్ కామత్ 2022, ఆగస్టు 25న డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్యదర్శిగా, డీఆర్‌డీవో చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలాన్ని తాజాగా 2026, జూన్ 1 నుంచి 2027, మే 31 తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పొడిగిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ చైర్మన్ మనీశ్ సక్సేనా ఉత్తర్వులు జారీ చేశారు.
- Advertisement -