- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్రలోని అంబర్ నాథ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివసేన అభ్యర్థిని తీసుకెళ్తున్న కారు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో కారు అదుపుతప్పి, డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ఐదు వాహనాలను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారు డ్రైవర్‌తో సహా నలుగురు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ కాలు యాక్సిలరేటర్‌పై ఇరుక్కుపోవడమే గుండెపోటుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
- Advertisement -



