- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సుడాన్‌లో ఆర్మీ, రెబల్స్(పారా మిలిటరీ) మధ్య ఆధిపత్య పోరులో వేలాది మంది అమాయకులు చనిపోతున్నారు. తాజాగా ఆర్మీ కంట్రోల్‌లో ఉన్న కలోగిపై రెబల్స్ చేసిన డ్రోన్ దాడిలో 79 మంది మరణించారు. వీరిలో 43 మంది చిన్న పిల్లలు ఉన్నారు. మరో 38 మంది గాయపడ్డారు. రెబల్స్ తొలుత కిండర్‌గార్టెన్(స్కూల్), ఆస్పత్రిపై దాడి చేశారు. పిల్లలను రక్షించేందుకు బలగాలు ప్రయత్నిస్తుండగా మళ్లీ అటాక్ చేసినట్లు అధికారులు తెలిపారు.
- Advertisement -



