Monday, March 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇంధన ట్యాంక్‌పై డ్రోన్‌ దాడి..దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత

ఇంధన ట్యాంక్‌పై డ్రోన్‌ దాడి..దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఇరాన్‌తో ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌, అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌.. డ్రోన్‌ దాడులను తీవ్రతరం చేసింది. తన పొరుగుదేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. ఇవాళ తెల్లవారుజామున దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్‌ దాడులు చేసింది. ఈ సందర్భంగా ఒక డ్రోన్‌ ఇంధన ట్యాంక్‌ను ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. దాంతో విమానాశ్రయంలోని అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. విమానాశ్రయాన్ని మూసివేసినట్లు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు, ఎయిర్‌పోర్టు సిబ్బందికి సేఫ్టీ నోటీస్‌ జారీచేశారు. విమానాల స్టేటస్‌ తెలుసుకునేందుకు విమానయాన సంస్థలను సంప్రదించాలని ప్రయాణికులకు సూచనచేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -