- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సూడాన్‌లో ఆర్మీ, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. తాజాగా ఈద్ రోజున పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ ఆధీనంలో ఉన్న ఓ నగరంలోని ఆస్పత్రిపై డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో 64 మంది మృతి చెందారు. వీరిలో 13 మంది చిన్నారులు, ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు ఉన్నారు. మరో 89 మంది గాయపడినట్లు తెలిసింది. ఈ దాడిని ఆర్మీ చేసినట్లు పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ ఆరోపించింది.
- Advertisement -



