- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ కమిషరేట్ పరిధిలో రౌడీషీటర్ల ఆగడాలు పెరగడంతో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సీపీ సజ్జనార్ ఆదేశాలతో రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహించారు. నగరంలో ప్రస్తుతం 1,300 మందికి పైగా రౌడీషీటర్లు ఉన్నారు. వారిలో 250 మందికిపైగా డ్రగ్ టెస్టులు నిర్వహించారు. 190 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో గంజాయి సరఫరాదారులపై కఠిన చర్యలు చేపట్టనున్నారు.
- Advertisement -



