- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ- మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ పై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. సింహ, లెజెండ్, అఖండ వంటి ఘన విజయాల తర్వాత ఈ జోడీ మరోసారి స్క్రీన్ మీద అదరగొట్టేందుకు సిద్ధమవుతోంది. అఖండ 2 చిత్రం 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘అఖండ’ కు సీక్వెల్ కావడం విశేషం. ఆ చిత్రంలో బాలయ్య పోషించిన ఆఘోర పాత్ర, బోయపాటి మాస్ మేకింగ్, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఆ ఫార్ములాను మరింత పవర్‌ఫుల్‌గా స్క్రీన్ మీదకి తీసుకురావాలని బోయపాటి తెగ కష్టపడుతున్నారు.
- Advertisement -