నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయిల్ ప్రేరేపిత యుద్ధంతో చమురు కొరత నానాటీకి పెరిగిపోతుంది. భారత్ లాంటి దేశాల్లో గ్యాస్ కొరత తీవ్ర స్థాయికి పెరిగిపోయింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు ఆందోళనం వ్యక్తం చేస్తున్నాయి. కానీ మోడీ సర్కార్ గ్యాస్ కొరత లేదని బుకాయిస్తుంది. ఏమి లేదు అంటునే ఇప్పటికే డొమిస్టిక్ సిలిండర్లపై బుకింగ్ కాలపరిమితి పెంచింది. గ్రామీణ ప్రాంతాలకు 45 రోజులు, పట్ణణంలో 25 రోజులకు పెంచగా, కమర్షియల్ గ్యాస్ బండాల సరఫరాను కుదించింది. అంతకముందు డొమిస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల రేట్లను కూడా విపరీతంగా పెంచింది.
అయితే గ్యాస్ కొరత కారణంగా వసతి గృహాలు, హాటల్స్, రెస్టారెంట్లు, ఇతరేతర వ్యాపార సంస్థలపై పెను ప్రభావం పడింది. గ్యాస్ వాడకం ఎక్కువ ఉంటే పుడ్ మెన్‌లను తగ్గించారు. అదే విధంగా ఆన్‌లైన్ పుడ్ డెలవరీలు కూడా భారీ మొత్తంలో ఆర్డర్లు తగ్గుముఖం పెట్టాయి. దీంతో పలువురు వ్యాపార వేత్తలు ఉపాధి కోల్పోయి పరిస్థితి తలెత్తింది.
కానీ మరికొందరు ఇదే అదునుగా భావించి గ్యాస్ కొరత పేరుతో అనధికారంగా రేట్లు పెంచుతున్నారు. డ్యూ ఆప్ గ్యాస్ అంటూ సవరించిన ధరల బోర్డులను తమ తమ దుకాణాల సముదాయాల ఎదుట ప్రదర్శిస్తున్నారు. పని అలసటతో టీ తాగి ఉపశమనం పొందుతామంటే పెంచిన రేట్లతో వినియోగాదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. టీ రేట్ చూసి..తలనొప్పి ఎక్కువయ్యే పరిస్థితి తలెత్తిందని టీ ప్రియులు వాపోతున్నారు. బడా హోటల్స్ పుల్ టీ, సింగిల్ టీ అంటూ 20 నుంచి 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. గ్యాస్ కొరత అంటూ అదనంగా రూ.3 నుంచి 5 రూపాయలు పెంచారు. సాధారణ టీ స్టాల్స్ నిర్వహకులు కూడా రూ.10, 15, 20 రూపాయలకు పెంచారు. రోజులో ఐదు ఆరుసార్లు టీ తాగే.. టీ ప్రియులు గ్యాస్ కొరత పేరుతో పెరిగిన రేట్లతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు.



