నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం లోని పంభాపూర్ గ్రామానికి చెందిన ఆగబోయిన బాబు అనే ఆదివాసి గిరిజన రైతు కు చెందిన దుక్కిటెద్దు మృతి చెందింది. ప్రతి రోజు లాగానే శుక్రవారం సమీప పొలాలకు మేతకు వెళ్ళింది. ఓ రైతు తన వ్యవసాయ భూమిలో మోటారు స్టాటరు వద్ద తన అవసరం నిమిత్తం ఒక బల్బును అమర్చుకొని ఎర్త్ ను ఏర్పాటు చేసుకున్నాడు. దురదృష్టవశాత్తు ఎర్త్ వైర్ ఫెయిల్ అయి మేత కు వచ్చిన దుక్కిటెద్దు అక్కడికక్కడే మృతి చెందింది. శనివారం ఉదయం రైతు ఆగబోయిన బాబు తన దుక్కిటేది కోసం వెతికాడు. అది ఆ పొలం వద్ద విద్యుత్ ఘాతుకం గురై అక్కడికక్కడే మృతి చెందింది. వర్షాకాలం నెత్తిమీదికి రావడంతో, ఇప్పుడే దుక్కిటెద్దు మృతి చెందడంతో ఆదివాసి రైతు బోరున విలపించాడు. ఈ దుక్కిటెద్దు సుమారు 50 వేలు విలువచేస్తుంది. ఈ నిరుపేద ఆదివాసి గిరిజన రైతుకు ఆర్థిక సాయం అందించి తన వ్యవసాయానికి తోడ్పడాలని అధికారులను వేడుకుంటున్నాడు. కాగా ఆదివాసి గిరిజన సంఘాలు కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆగబోయిన బాబు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
విద్యుత్ ఘాతంతో దుక్కిటేద్దు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES