నవతెలంగాణ – ఆఫ్ఘనిస్తాన్: మరోసారి భూకంపం బారిన పడింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉదయం 10.19 గంటలకు 5.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూమికి 37 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర కేంద్రీకృతం అయింది. ఈ భూకంపం ప్రభావం జమ్మూ కాశ్మీర్, హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో కూడా కనిపించింది. శ్రీనగర్, పూంచ్ ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదు అయ్యాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్, పెషావర్, లాహోర్, ఇతర నగరాల్లో 6.3 తీవ్రతతో భూకంపం వచ్చిందని అక్కడి సోషల్ మీడియా వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్ దేశం భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడి హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో భూకంపాలు తరుచుగా సంభవిస్తుంటాయి. ఈ ప్రాంతంలో ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, క్రమంగా యూరేషియా ప్లేట్ ను ఉత్తర దిశగా ముందుకు నెడుతుంది. దీని కారణంగా అత్యధిక శక్తి భూకంపాల రూపంలో విడుదల అవుతుంది.