నవతెలంగాణ-హైదరాబాద్: చైనాలో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రికార్డు స్కేలుపై దీని తీవ్రత 4.5 గా నమోదైంది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం … భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల 29 నిముషాలకు ఈ ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భూకంప ప్రకంపనలు రావటంతో కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు భయపడి ఇళ్లలో నుంచి బయటకి పరుగులు తీశారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదు. కాగా, చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. అలాగే, శుక్రవారం తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా భూకంపం సంభవించినట్లు సమాచారం. రికార్డు స్కేలుపై దీని తీవ్రత 4గా నమోదైంది.
చైనాలో భూకంపం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES