- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: చైనా లో భారీ భూకంపం సంభవించింది. సిచువాన్ ప్రావిన్స్‌లోని జిన్‌లాంగ్ కౌంటీలో గురువారం భూమి ఒక్కసారిగా కంపించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 5.4గా నమోదైనట్లు చైనా భూకంప కేంద్రం తెలిపింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది.
ఈ భూకంపం ధాటికి పొరుగున ఉన్న భూటాన్ ()లోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అక్కడ భూకంపం తీవ్రత 3.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఈ భూకంపం ధాటికి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఈ ఘటనలో ధాటికి ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.
- Advertisement -