Friday, April 10, 2026
E-PAPER
Homeజాతీయంకోల్‌క‌తాలో భూకంపం..

కోల్‌క‌తాలో భూకంపం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప‌శ్చిమ బెంగాల్ రాజ‌ధాని కోల్‌కతాలో భూకంపం సంభవించింది. ఈ రోజు(శుక్ర‌వారం) మధ్యాహ్నం స‌మ‌యంలో కోల్‌కతాలో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఉదయం బంగ్లాదేశ్‌లో 5.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీని ప్రభావంతో కోల్‌కతా, పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో కార్యాలయాలు, భవనాల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. ప్రాథమిక నివేదికల ప్రకారం.. కోల్‌కతాలో కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5గా నమోదయ్యింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -