Tuesday, May 20, 2025
Homeఅంతర్జాతీయంనేపాల్ లో భూకంపం..

నేపాల్ లో భూకంపం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హిమాలయ దేశం నేపాల్‌లో మరోసారి భూమి కంపించింది. మంగళవారం సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైనట్లు జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం (NEMRC) వెల్లడించింది. వారం రోజుల వ్యవధిలో నేపాల్‌లో భూకంపం రావడం ఇది రెండోసారి కావడంతో స్థానికులలో కొంత ఆందోళన నెలకొంది.

భూకంప కేంద్రం రాజధాని ఖాట్మండుకు వాయువ్యంగా సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాస్కీ జిల్లాలోని సినువా ప్రాంతంలో కేంద్రీకృతమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంపం కారణంగా కాస్కీతో పాటు సమీపంలోని తనహు, పర్వత్, బాగ్లుంగ్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు స్వల్ప ప్రకంపనలు గుర్తించినట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -