నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్‌పై దాడులకు తెగబడుతున్న పాకిస్తాన్ భూ ప్రకంపనలతో వణికిపోయింది. శనివారం తెల్లవారుజామున 01.44 గంటలకు పాకిస్తాన్‌లో భూకంప ప్రకంపనలు సంభవించాయి. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం.. రిక్టర్ స్కేల్‌పై 4.0తో ప్రకంపనలు నమోదయ్యాయి. భూమికి పది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గురించినట్లు పేర్కొంది. ఇటీవల పాక్‌లో భూకంపం రావడంతో ఇది నాలుగోసారి. ఇంతకు ముందు మే 5న 4.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. పాకిస్తాన్ యురేషియన్, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ల కలిసే ప్రదేశంలో ఉంది. దాంతో తరచుగా శక్తివంతమైన భూకంపాలు వస్తుంటాయి. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్ తదితర ప్రాంతాలు యురేషియన్ ప్లేట్ దక్షిణ అంచున ఉండడం వల్ల భూకంపాల బారినపడుతున్నాయి.
పాకిస్తాన్‌లో అర్థరాత్రి భారీ భూకంపం..భయభ్రాంతులకు గురైన జనం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES