- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: నేడు రాజస్థాన్‌లో ఝన్‌ఝను పట్టణంలో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 3.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూ ఉపరితలానికి పది కిలోమీటర్ల లోతులో భూకంపం నమోదైనట్లు ఎన్‌సిఎస్ ఎక్స్ పోస్టులో పేర్కొంది.
- Advertisement -