- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : టర్కీలో భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం సుమారు 3:46 గంటలకు భూమి కంపించినట్టు స్వతంత్ర శాస్త్రీయ సంస్థ ఈఎంఎస్‌సి వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైంది. కులు నగరానికి ఈశాన్యంగా 14 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
ఈ భూకంప ప్రభావం టర్కీ రాజధాని అంకారా వ్యాప్తంగా స్పష్టంగా కనిపించగా, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఈ ఘటనలో తక్షణమే ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
- Advertisement -