Tuesday, October 28, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంటర్కీ, నేపాల్‌లో భూకంపం..

టర్కీ, నేపాల్‌లో భూకంపం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇవాళ తెల్లవారుజామున టర్కీలో పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అయితే, భూ ప్రకంపనల ప్రభావం రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. భూకంపంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో తెలియక ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. భూకంప కేంద్రం, ప్రభావితమైన ప్రాంతాల పూర్తి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. అదేవిధంగా ఆస్తి, ప్రాణ నష్టంపై ఎలాంటి సమాచారం అందలేదు.
పొరుగు దేశం నేపాల్‌లో కూడా ఇవాళ ఉదయం 7.15కు పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. అయితే, భూ ప్రకంపనల ప్రభావం రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైనట్లుగా జాతీయ భూకంప కేంద్రం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -