- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జపాన్ ఉత్తర తీరంలో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. ఇవాటే ప్రావిన్సు తీరంలో 10 కిలోమీటర్లు లోతులో భూకంప కేంద్రం ఉందని, 6.7 తీవ్రతతో ఇది సంభవించిందని జపాన్ మెటిరోలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది.
- Advertisement -



