- Advertisement -
నవతెలంగాణ ఇస్తాంబుల్ : టర్కీని భూకంపం వణికించింది. బలికెసిర్ ప్రావిన్సులో ఆదివారం సాయంత్రం భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఈ భూకంప తీవ్రతకు 200 కిలోమీటర్ల దూరంలోని ఇస్తాంబుల్‌లోనూ భూమి కంపించింది. భూకంపం ధాటికి సిందిర్గి పట్టణంలో దాదాపు 16 భవనాలు నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద చిక్కుకుని 29 మంది తీవ్రంగా గాయపడగా, ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. శిథిలాలను తొలగించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
- Advertisement -