Wednesday, November 5, 2025
E-PAPER
Homeజాతీయంరాహుల్ వ్యాఖ్య‌ల‌ను ఖండించిన ఈసీ

రాహుల్ వ్యాఖ్య‌ల‌ను ఖండించిన ఈసీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: దేశంలో రెండో ద‌ఫా ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ డ్రైవ్(SIR) ప్రక్రియ కొన‌సాగుతుండ‌గా ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీ ఉదంతంపై కీల‌క వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. హర్యానాలో 5.21 లక్షల నకిలీ ఓటర్లు, 93,174 చెల్లని ఓటర్లు, 19.26 లక్షల బల్క్ ఓటర్ల ద్వారా 25 లక్షల ఓట్లు దొంగిలించబడ్డాయని ఆయన ఆరోపించారు. తాజాగా ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం(ఈసీ) ఖండించింది.

ఎన్నికల సంఘం కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్లను ప్రశ్నించింది. ఒక ఓటరు అప్పటికే ఓటు వేసి ఉన్నా, ఓటర్ గుర్తింపుపై ఏదైనా సందేహం ఉన్న అభ్యంతరాలు వ్యక్తం చేయాలి కదా అని కాంగ్రెస్ బూత్ ఏజెంట్ల పనితీరును ప్రశ్నించింది. ఇప్పటి వరకు దీనిపై కాంగ్రెస్ బూల్ లెవల్ ఏజెంట్లు ఎలాంటి వాదనల్ని అభ్యంతరాలను లేవనెత్తలేదని, ఈ విషయంలో వారు ఎలాంటి అప్పీళ్లు దాఖలు చేయలేదని ఈసీ ఎత్తిచూపించింది. నకిలీ ఓటర్లు ఉంటే, వారంతా బీజేపీకి మద్దతు ఇచ్చారని రాహుల్ గాంధీ ఎలా చెబుతున్నారో అర్థం కావడం లేదని ఈసీ వ్యాఖ్యానించింది. బదులుగా ఈ ఓటర్లు కాంగ్రెస్ కు ఓటు వేసి ఉండొచ్చు కదా అనే ప్రశ్నను లేవనెత్తింది.

బీహార్ ఎన్నికలకు ముందు ఈసీ సర్‌ని ప్రారంభించింది. తాజాగా 51 కోట్ల మంది ఓటర్ల అర్హత గుర్తించేందుకు 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల సంఘం మంగళవారం సర్ ప్రారంభించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -