అలా కాదంటే నిరూపించుకోవాల్సిందే: కాంగ్రెస్
12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఆఫీస్ బేరర్లతో ఖర్గే భేటీ
న్యూఢిల్లీ : బీజేపీ కనుసన్నల్లో పనిచేయడం లేదని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) వెంటనే నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈసీ నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ తీవ్ర విచారకరంగా ఉందని ఆయన ఆరోపించారు. ఓట్ల చోరీకి పాల్పడేందుకు ఒక అస్త్రంగా సర్ ప్రక్రియను ఈసీ దుర్వినియోగం చేస్తోందని అన్నారు. ప్రస్తుతం సర్ ప్రక్రియ జరుగుతున్న 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఆఫీస్ బేరర్లతో ఖర్గే మంగళవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్, ఆయా రాష్ట్రాలు/యూటీల కాంగ్రెస్ అధ్యక్షులు, ఏఐసీసీ ఇన్‌చార్జీలు, ఏఐసీసీ కార్యదర్శులు, సీఎల్‌పీ నేతలు పాల్గొన్నారు.
‘ఈసీ మౌనంగా సహకరిస్తున్నట్టుంది..’
’12 రాష్ట్రాలు/యూటీలలో ప్రస్తుతం సర్ ప్రక్రియ జరుగుతున్న తీరుపై మేం పార్టీపరంగా సమీక్ష నిర్వహించాం. ఓటర్ల జాబితా సమగ్రత దెబ్బతినకుండా ఉండేందుకు మేం కట్టుబడి ఉంటాం. దీనిపై ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. ప్రజాస్వామిక సంస్థలపై ప్రజలకు ఉన్న విశ్వాసం సన్నగిల్లుతున్న వేళ, సర్ ప్రక్రియను ఈసీ నిర్వహిస్తున్న తీరు బాధాకరంగా ఉంది. ఈ తరుణంలో బీజేపీ కనుసన్నల్లో పనిచేయడం లేదని వెంటనే నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. ఏ అధికార పార్టీకీ తలొగ్గకుండా, కేవలం భారత ప్రజలకు విధేయతగా ఉంటామని చేసిన రాజ్యాంగ ప్రమాణాన్ని ఈసీ గుర్తుంచుకోవాలి. ఓట్ల చోరీకి పాల్పడేందుకు ఒక అస్త్రంగా సర్ ప్రక్రియను బీజేపీ వాడుకుంటోందని మేం బలంగా నమ్ముతున్నాం. ఒకవేళ ఇలాంటి మార్గాన్ని ఈసీ ఎంచుకొని ఉంటే, ఈ వైఫల్యం పాలనాపరమైన అంశానికి పరిమితం కాదు. ఓ తప్పునకు ఈసీ మౌనంగా సహకరిస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది’ అని ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ పంజరంలో ఈసీ
- Advertisement -
- Advertisement -



