- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బొగ్గు మాఫియా, మైనింగ్ కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం పశ్చిమబెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలపై దాడులు నిర్వహించింది. రెండు రాష్ట్రాల్లోనూ సుమారు 45 ప్రాంతాల్లో సోదాలు చేపడుతోంది. బొగ్గు మాఫియా సిండికేట్లపై చర్యల్లో భాగంగా రెండు రాష్ట్రాల్లో ఉదయం 6.00గంటల నుండి 100మందికి పైగా ఇడి అధికారులు మరియు సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు. జార్ఖండ్‌లో సుమారు 18 ప్రాంతాల్లో, పశ్చిమబెంగాల్‌లోని పురులియా, దుర్గాపూర్, హౌరా మరియు కోల్‌కతా జిల్లాలోని సుమారు 24 ప్రాంతాల్లో సోదాలు చేపడుతోంది.
- Advertisement -



