నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్‌లో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ఆర్జేడీ నేత తేజిస్వి యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈసీ నిర్ణయం ప్రకారం 11 ప్రామాణిక పత్రాలను సమర్పించకపోతే..ఎలక్ట్రో రోల్ నుంచి వారి పేర్లను తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎస్ఐఆర్ విధానంపై ఈనెల 5న ఈసీని కలిసి, పలు సందేహాలు లెవనెత్తామని ఆయన గుర్తు చేశారు. అయినా తమ ప్రశ్నలకు ఇంతవరకు స్పష్టమైన సమాధానం రాలేదన్నారు. ఈసీ కేవలం పోస్టాఫీసు తరహాలో కూడా పని చేయడంలేదని, ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం ఇవ్వలేదని ఆయన మీడియా సమావేశంలో మండిపడ్డారు. బీహార్ పేద ప్రజల వద్ద కేవలం ఆధార్ కార్డు, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కార్డు, రేషన్ కార్డు ఉన్నాయని, 11 డ్యాకుమెంట్లు అందజేయక పోతు వారి పేర్లును తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు ఓటర్ల జాబితా సవరణ దేనికని, రెండు నెలల్లో జాబితాను సవరించడం సాధ్యమా..? అని అర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్ ప్రశ్నిస్తున్నారు.
ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ఈసీ సమాధానమివ్వట్లే: తేజిస్వి యాదవ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES