Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆయిల్ ఫామ్ సాగుతో ఆర్థిక అభివృద్ధి 

ఆయిల్ ఫామ్ సాగుతో ఆర్థిక అభివృద్ధి 

- Advertisement -

పాలకుర్తిలో ఆయిల్ ఫామ్ గెలల సేకరణ సెంటర్ ప్రారంభం 
ఆయిల్ పెడ్ ఫీల్డ్ అధికారి వరుణ్ 
నవతెలంగాణ – పాలకుర్తి

రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఆయిల్ ఫామ్ సాగు పట్ల దృష్టి పెట్టాలని ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ అధికారి పూజారి వరుణ్ రైతులకు సూచించారు. ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో మంగళవారం పాలకుర్తిలో ఆయిల్ ఫామ్ గెలల సేకరణ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగుచేసిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం మండల కేంద్రాల్లోనే ఆయిల్ ఫామ్ గెలల సేకరణ కేంద్రాలను ప్రారంభిస్తుందని తెలిపారు. రైతులు ఎక్కడో అమ్ముకోవాల్సిన అవసరం లేదని మండల కేంద్రాల్లోనే రైతులకు  అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఆయిల్ఫడ్ సంస్థ మార్కెటింగ్ ఏర్పాటు చేసి ఆయిల్ ఫామ్ గెలలను కొనుగోలు చేయడం రైతులకు వరం లాంటిది అన్నారు. ఆయిల్ ఫామ్ గెలలు సేకరించి ఫ్యాక్టరీకి పంపిన మూడు రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -