Friday, July 25, 2025
E-PAPER
Homeబీజినెస్మింత్రాపై ఈడీ కొరడా

మింత్రాపై ఈడీ కొరడా

- Advertisement -

ఎఫ్‌డీఐ నిబంధనల ఉల్లంఘన ఎఫెక్ట్‌
న్యూఢిల్లీ :
ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన మింత్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఫారిన్‌ ఎక్స్ఛేంజీ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ (ఫెమా) కింద కేసు నమోదు చేసింది. ఎఫ్‌డిఐ నిబంధనలు ఉల్లంఘించి రూ.1,654.35 కోట్ల అవకతవకలకు పాల్పడిందని ప్రధాన ఆరోపణ. మింత్రా, హోల్‌సేల్‌ క్యాష్‌ అండ్‌ క్యారీ ముసుగులో మల్టీ బ్రాండ్‌ రిటైల్‌ ట్రేడింగ్‌ నిర్వహిస్తూ, విదేశీ పెట్టుబడులు స్వీకరించింది. తమ ఉత్పత్తులను వెక్టర్‌ ఇ-కామర్స్‌ అనే అనుబంధ సంస్థకు 100 శాతం విక్రయించి.. ఆ సంస్థ ద్వారా రిటైల్‌ కస్టమర్లకు చేరేలా చేసింది. ఎఫ్‌డీఐ నిబంధనల ప్రకారం 25 శాతం లోపే గ్రూప్‌ కంపెనీలకు విక్రయించాలనే నిబంధనను ఉల్లంఘించడమేనని ఈడీ తెలిపింది. హోల్‌సేల్‌ క్యాష్‌ అండ్‌ క్యారీ అంటే ఉత్పత్తులను రిటైలర్లకు లేదా ఇతర వ్యాపార సంస్థలకు హోల్‌సేల్‌గా విక్రయించొచ్చు. వినియోగదారులకు నేరుగా విక్రయాలు జరపకూడదు. ఒకే గ్రూప్‌నకు చెందిన సంస్థకు ఇలా పూర్తి విక్రయాలు జరపడం ఫెమా నిబంధనలు ఉల్లంఘించడం కిందకు వస్తుందని గుర్తించి ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మింత్రాతో పాటు అనుబంధ సంస్థలు, డైరెక్టర్లపై ఈడీ అభియోగాలు మోపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -