- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ అయిన ఐప్యాక్ ఆఫీసుల్లో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆకస్మిక తనిఖీలు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలోని ఐప్యాక్ కార్యాలయాల్లో గురువారం ఈ సోదాలు జరిగాయి. త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి టీఎంసీ పార్టీకి ఐప్యాక్ ప్రస్తుతం పనిచేస్తుండటం గమనార్హం. కోల్ స్మగ్లింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ఐప్యాక్ కార్యాలయాల్లో సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాదులోనూ ఈడీ సోదాలు జరిగాయి. దేశవ్యాప్తంగా 10 చోట్ల సోదాలు ఈడీ సోదాలు జరుగుతున్నాయి.
- Advertisement -



